న్యూఢిల్లీ: కరోనా కారణంగా కిందటేడాది మార్చి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతోన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ చేపడుతామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఎస్ఓపీని శనివారం రిలీజ్ చేసింది. ఫిజికల్ విచారణను తిరిగి కొనసాగించే క్రమంలో ప్రయోగాత్మకంగా హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ విధానంలో ఫిజికల్, వీడియో కాన్ఫరెన్స్.. రెండింటి ద్వారా కేసులను విచారించనుంది. మంగళ, బుధ, గురువారాల్లో ఫైనల్ హియరింగ్స్/లిస్ట్ అయిన కేసులను హైబ్రిడ్ మోడ్ లో విచారణ చేపట్టనున్నారు. పార్టీల సంఖ్య, కోర్టు రూముల లభ్యత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇతర కేసులను కూడా ఈ విధానంలో విచారిస్తారు.
